పురుషోత్తపురంలో పోటెత్తిన ఓటర్లతో రికార్డు స్థాయిలో భారీ పోలింగ్

రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లకు గాను, రెండు వేల నూట డెబ్బై ఓట్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓటర్లు ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.