ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి నారాయణ

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అరవై వినతులను స్వీకరించినట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. వచ్చిన అర్జీల్లో డెబ్బై శాతానికి పైగా రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించినవే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పలు సమస్యలపై అధికారులతో నేరుగా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం అని స్పష్టం చేశారు.