మతమార్పిడి చేసుకొని వివాహం చేసుకున్న చెల్లెలిని హత్య చేసిన అన్న అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Mathura
మతమార్పిడి చేసుకొని వేరే యువకుడిని వివాహం చేసుకుందనే కక్షతో చెల్లెలిని గొంతునులిమి హత్య చేసిన ఘటనలో అక్రమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మధుర పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి సమాచారం మేరకు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.