ఆదర్శకుటుంబం సినిమాపై వస్తున్న పుకార్లపై స్పష్టతనిచ్చిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఆదర్శకుటుంబం, బ్లాస్ట్ సినిమాల కథలు ఒకటేనంటూ వస్తున్న పుకార్లపై హీరోయిన్ శ్రీనిధి శెట్టి స్పష్టతనిచ్చారు. తాను బ్లాస్ట్ సినిమా చూశానని, ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ ముప్పై న గ్రాండ్గా విడుదల కానుందని ఆమె వెల్లడించారు. ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు.