సోషల్ మీడియా ప్రచారం కోసం కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత వేగంగా చేరవేసేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి ఆమోదం లభించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా ప్రభుత్వ ప్రచారం నిర్వహించనున్నారు. ఫాలోవర్ల ఆధారంగా క్రియేటర్లను నాలుగు కేటగిరీలుగా విభజించి, నెలకు గరిష్ఠంగా లక్షన్నర రూపాయల పారితోషికం చెల్లించనున్నారు.