ఫ్లోలో అలా అన్నాను: కేసీఆర్ చావు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వివరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
కేసీఆర్ చావును కోరుకుంటున్నట్లు తాను ఫ్లోలో అలా మాట్లాడానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విచిత్ర వివరణ ఇచ్చారు. కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే తాము కేసీఆర్ చావును కోరుకోవడం లేదని, అసెంబ్లీకి వస్తే గౌరవిస్తామని మాట మార్చారు. తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆయన క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం.