బెంగళూరులో దారుణం: కూతురితో అడ్డంగా దొరికిన యువకుడిని కొట్టి చంపిన తండ్రి

రిపోర్టర్: సురేష్ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని యెలహంకలో కుమార్తెతో కలిసి ఉన్నాడనే కోపంతో తన వద్ద పనిచేస్తున్న కిరణ్ అనే ఉద్యోగిని ఆనంద్ రాజ్ అనే వ్యక్తి అత్యంత పాశవికంగా బ్యాట్ తో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేరళకు చెందిన కిరణ్ గత రెండేళ్లుగా ఆనంద్ రాజ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడని, వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు స్పష్టం చేశారు.