రాష్ట్రంలో తీవ్ర వాయుగుండం ముప్పుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
రాష్ట్రానికి తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్, డీజీపీ మరియు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం-కవిటి మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నందున ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మరోవైపు ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యతనిస్తూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.