రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందంటూ బీఆర్ఎస్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: గోపి
స్థలం: Telangana
రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని Bharat Rashtra Samithi (BRS) తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నా, నిండు సింగూరు ప్రాజెక్టు జలాలను వదిలేశారని ఆక్షేపించింది. నేడు పచ్చని చేలల్లో కరువు తాండవిస్తోందని, కరెంట్ కోతలతో మోటార్ల వద్ద పడిగాపులు కాస్తూ రైతన్నలు దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కష్టకాలంలో కేసీఆర్ నాయకత్వం ఎంతగానో గుర్తుకొస్తోందని బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా పేర్కొంది.