బీహార్‌షరీఫ్‌లో భోజ్‌పురి నటి కాజల్ రాఘవాని కారుపై అభిమానుల దాడి

రిపోర్టర్: గోపి స్థలం: బీహార్

బీహార్‌లోని బీహార్‌షరీఫ్‌లో ఓ ఆభరణాల షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన భోజ్‌పురి నటి కాజల్ రాఘవాని కారును భారీగా అభిమానులు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. షాపు నిర్వాహకుల సహాయంతో ఆమె సురక్షితంగా అక్కడి నుంచి బయటపడగా, తాను క్షేమంగా ఉన్నట్లు నటి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయగా, నిర్వాహకులు మాత్రం అనుమతి కోరామని తెలిపారు.