అరుణాచల్ ప్రదేశ్ లో తీవ్ర ఉద్రిక్తత: సియాంగ్ నైపథ్యంలో మూడు జిల్లాల బంద్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్ లో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ వివాదం తీవ్రరూపం దాల్చింది. ఈ మేరకు అరెస్టయిన ఆందోళనకారులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సియాంగ్ నది పరిసర ప్రాంతాల్ లోని మూడు జిల్లాల్ లో సోమవారం బంద్ కు పిలుపునిచ్చినట్లు సియాంగ్ ఎఫెక్టెడ్ ఏరియా యూత్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న గ్రామస్థులు, ఆదివాసీ సంఘాలు ఈ బంద్ లో పాల్గొని తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు.