గురువులపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయవాడ

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైఎస్సార్సీపీ నేతలు జరిపిన దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. దాడిలో పాల్గొన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు, రౌడీషీటర్లను గుర్తిస్తూ మాచవరం, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.