హ్యూస్టన్లో వైభవంగా గోల్డెన్ జూబ్లీ: టీసీఏ ఆధ్వర్యంలో కుటుంబ పిక్నిక్
రిపోర్టర్: మహేష్
స్థలం: Houston
అమెరికాలోని హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి యాభై ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కుడుముల తెలిపారు. వచ్చే అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన మిస్సౌరీ సిటీలోని కిట్టి హాలో పార్కులో ఈ కుటుంబ పిక్నిక్ వేడుక అట్టహాసంగా జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. రుచికరమైన వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సాగే ఈ వేడుకకు ప్రవాస తెలుగు కుటుంబాలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.