ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత ఫైటర్ సుచిక తరియల్
రిపోర్టర్: రమేష్
స్థలం: హర్యానా
ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో భారత ఫైటర్ సుచిక తరియల్ కాంస్య పతకం సాధించారు. మహిళల 60 కేజీల సెమీఫైనల్ పోరులో సింగపూర్ అథ్లెట్ హుయ్ హూన్ టేకోతో జరిగిన మ్యాచ్ డ్రా అయినప్పటికీ, తక్కువ బరువు నిబంధన కారణంగా ఆమె ఫైనల్ అర్హత కోల్పోయారు. హర్యానా రోహక్ జిల్లా కిలోయ్ గ్రామానికి చెందిన సుచిక, ఈ క్రీడల్లో భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించి చారిత్రక రికార్డు సృష్టించారు.