భారీ షాక్: గాయం కారణంగా క్రికెటర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరం

రిపోర్టర్: వెంకట్ స్థలం: బెంగళూరు

భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా కనీసం మూడు వారాల పాటు క్రికెట్కు దూరంగా ఉండనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఆయన ఎడమ తొడ కండరాల గాయానికి గురయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్న ఆయన, నవంబర్లో జరిగే న్యూజిలాండ్ సిరీస్కు అందుబాటులోకి రావడంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.