గుజరాత్ గ్రామంలో వ్యభిచార కూపం నుంచి కాపాడుకునేందుకు బాలికలకు చిన్న వయసులోనే నిశ్చితార్థాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: గుజరాత్
గుజరాత్ బనాస్కాంత జిల్లా వాడియా గ్రామంలో తరతరాలుగా వస్తున్న వ్యభిచార సంకెళ్ల నుంచి తమ కుమార్తెలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు వినూత్న మార్గం ఎంచుకున్నారు. పేదరికం, సామాజిక వివక్ష కారణంగా మహిళలు ఈ కూపంలోకి వెళ్లకుండా 7 నుంచి 12 సంవత్సరాల వయస్సులోనే బాలికలకు నిశ్చితార్థాలు జరిపిస్తూ రక్షణ కల్పిస్తున్నారు. సరణియా తెగకు చెందిన ఈ గ్రామంలో ఎన్‌జీఓల సహకారంతో చిన్నతనంలోనే ఎంగేజ్‌మెంట్లు చేసి 18 ఏళ్లు నిండాక వివాహాలు చేస్తున్నారు.