'రాజకీయ కక్ష సాధింపు చర్యే': కాంగ్రెస్ నేతలపై హరీశ్‌రావు పరువునష్టం దావా

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తనపై క్షుద్రపూజల పేరుతో అసత్య ఆరోపణలు చేసి ప్రతిష్ఠను దిగజార్చేందుకు కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ నాయకులు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్, అద్దంకి దయాకర్‌లపై బిఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. క్షమాపణలు చెప్పాలని గతంలో లీగల్ నోటీసులు పంపినప్పటికీ స్పందన లేకపోవడంతో, తన వ్యక్తిత్వాన్ని హసనం చేసేలా నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆయన అభ్యర్థించారు.