తీవ్ర తుఫాను ముప్పు: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Amaravati

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మురసు తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు నుంచి నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.