నా జీవితాన్ని మార్చేసిన ఆ తప్పు: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్

రిపోర్టర్: గోపి స్థలం: Mumbai

అక్రమ ఆయుధాల కేసులో తన జీవితాన్ని మార్చేసిన నిర్ణయంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆవేదన వ్యక్తం చేశారు. మనసు చెప్పిన మాట వినకుండా బుద్ధి చెప్పినట్లు నడుచుకోవడం వల్లనే తాను తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. శేఖర్ సుమన్ షోలో మాట్లాడిన సంజయ్ దత్, పోలీసుల అరెస్ట్ సమయంలో తన తండ్రి సునీల్ దత్ పడిన వేదనను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.