జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌కు పీలేరు విద్యార్థిని ఎంపిక

రిపోర్టర్: రమేష్ స్థలం: అన్నమయ్య

అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన ఇనుగొండ దీక్షిత జాతీయస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. మార్కాపురంలో జరిగిన అండర్-14 పోటీల్లో ప్రతిభ కనబరిచి ఛత్తీస్‌గఢ్‌లో జరిగే టోర్నీకి అర్హత సాధించింది. ఆమె తల్లి ఉషారాణి కూడా రెండ్రోజుల క్రితం జాతీయ క్రీడాకారిణి కావడం విశేషం. ఈ విజయంతో స్థానికులు దీక్షితను అభినందిస్తున్నారు.