ఇరవై రెండు ఏ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా ఇరవై రెండు ఏ భూముల సమస్యలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి సీసీఎల్ఏ డీఎస్. లోకేష్ కుమార్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో జీఓ నెం.118 ప్రకారం 9,700 ప్లాట్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమవుతుందని, సింగరేణి ప్రాంతంలో జీఓ నెం.76 ప్రకారం ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.