టెండర్లకు స్పందన కరువు: అటకెక్కిన బయోమైనింగ్ పనులు

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో పట్టణాల చెత్త నిర్వహణ ప్రణాళికలు ముందుకు సాగడం లేదని, పాత చెత్త తొలగింపు పనులు నత్తనడకన సాగుతున్నాయని అధికారులు తెలిపారు. క్లస్టర్ విధానం విఫలం కావడంతో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో యూనిట్లను ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ నిర్ణయించినా ప్రక్రియ నామమాత్రంగానే ఉందని వెల్లడించారు. పనుల్ లో జాప్యంపై ఎన్జీటి తీవ్రంగా స్పందించి డిసెంబర్ లోగా పూర్తి చేయాలని హెచ్చరించినప్పటికీ టెండర్లకు స్పందన కరవైందని అధికారులు పేర్కొన్నారు.