బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైభవంగా గణేశ్ పూజలు
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.