స్థానిక సంస్థల ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ ముద్రణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను మూడు విభాగాలుగా వర్గీకరించి పోస్టల్ బ్యాలెట్లో వివరాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులుగా విభజించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థి పేరు, పార్టీ వివరాలు తెలుగులోనే ముద్రించాలని పేర్కొంటూ ఆదివారం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.