ఆమనగల్ అభివృద్ధి కోరుతూ తల్లోజు ఆచారి ఆమరణ నిరాహార దీక్ష

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ పట్టణ అభివృద్ధి మరియు చిరు వ్యాపారుల జీవనోపాధి పరిరక్షణ కోసం మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 5, 6, 7 తేదీలలో గాంధీ చౌక్ చౌరస్తాలో ఈ దీక్ష కొనసాగనుంది. మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కర్నాటే విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.