ట్రెయిటర్స్ తెలుగు ట్రైలర్ విడుదల: హోస్ట్‌గా అరంగేట్రం చేసిన తేజ సజ్జ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రైమ్ వీడియో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ది ట్రెయిటర్స్ తెలుగు రియాలిటీ షో ట్రైలర్‌ను విడుదల చేసినట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది. విభిన్న రంగాలకు చెందిన ఇరవై మంది సెలబ్రిటీలతో ఈ ఉత్కంఠభరితమైన గేమ్‌ను రూపొందించారు. టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ ఈ షో ద్వారా హోస్ట్‌గా తొలిసారిగా అరంగేట్రం చేస్తున్నారు. నమ్మకం, మోసం, ద్రోహం ప్రధానాంశాలుగా సాగే ఈ పది ఎపిసోడ్ల సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.