ఎథిక్స్ కమిటీ నోటీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక లేఖ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

అసెంబ్లీలో అనుచిత ప్రవర్తన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. పూర్తిస్థాయి వీడియో ఫుటేజీని పరిశీలించాల్సి ఉందని, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వివరణ ఇచ్చేందుకు ఆరు వారాల గడువు కావాలని ఆయన కోరారు. తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు అధికార పక్షం ప్రయత్నిస్తోందని, దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.