ఫసల్ బీమా యోజన అమలు చేయాలని అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో ట్రాక్టర్లతో అసెంబ్లీకి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రీమియం చెల్లించి రైతులను ఆదుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు.