యాంకర్, నటుడు అలన్ రిచ్సన్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: World
ప్రముఖ హాలీవుడ్ నటుడు, 'రీచర్' ఫేమ్ అలన్ రిచ్సన్ తన భార్య క్యాథరిన్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దాదాపు 20 సంవత్సరాల పాటు కలివున్న తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. తమకు ముగ్గురు కుమారులు ఉన్నారని, పిల్లల పెంపకంలో మాత్రం ఇద్దరం కలిసి ఉంటామని, తమ గోప్యతను కాపాడాలని అభిమానులను కోరారు.