పరవాడలో ఆధ్యాత్మిక శోభతో మిన్నుముట్టిన విఘ్నేశ్వరుని పూజా మహోత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పరవాడ
విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలోని ఎన్డీఏ ఉమ్మడి కార్యాలయం ప్రాంగణంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14న ఉదయం స్వామివారి ప్రతిష్ఠాపనతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. 18న లక్ష్మీ గణపతి హోమం, భారీ అన్న సమారాధన కొనసాగుతాయి. 20న స్వామివారి నిమజ్జనంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ నిర్వాహకులు సభక్తికంగా పిలుపునిచ్చారు.