ఉపాధ్యాయులను వేధిస్తున్న గొడ్డలి పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Andhra Pradesh
చదువులు చెప్పే ఉపాధ్యాయులకు గొడ్డలి పార్టీ ఇస్తున్న బహుమతులు ఇవేనంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఉపాధ్యాయుల పట్ల వైఎస్సార్సీపీ అనుసరిస్తున్న తీరును, డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనను ప్రస్తావిస్తూ నెటిజన్లు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హ్యాష్ ట్లతో పోస్టులు వైరల్ అవుతున్నాయి.