విజయవాడ ఉత్సవ్కు రావాలంటూ ఒడిశా గవర్నర్కు ఎంపీ కలిశెట్టి ఆహ్వానం

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

విజయవాడ ఉత్సవ్కు హాజరుకావాలని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ మాఝిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భువనేశ్వర్లో మంగళవారం వారిని కలిసి ఆయన ఆహ్వానపత్రాలు అందజేశారు. ఇతర రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వానాలు అందించడం ద్వారా సాంస్కృతిక సంబంధాలు, పరస్పర స్నేహభావం మరింత బలోపేతం అవుతాయని ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు.