పురపాలక ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసు అధికారుల కఠిన దిశానిర్దేశం
రిపోర్టర్: సురేష్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పోలీసుల సమన్వయంతో పురపాలక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చాపురం మరియు పలాస కాశీబుగ్గ పురపాలక ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల పారదర్శకతను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని ఎస్పీ తెలిపారు.