పులివెందులలో కలకలం: వైఎస్ జగన్ కాన్వాయ్ కు అడ్డుగా నిలిచిన దస్తగిరి వాహనం

రిపోర్టర్: కిరణ్ స్థలం: పులివెందుల

పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కు దస్తగిరి తన స్కార్పియో వాహనాన్ని అడ్డుగా నిలిపినట్లు పోలీసులు తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఈ విధంగా ఎదురుగా రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జోక్యం చేసుకుని దస్తగిరిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లడంతో కాన్వాయ్ తిరిగి ముందుకు కదిలిందని అధికారులు వెల్లడించారు.