సర్వేపల్లిలో వినాయక మండపం వద్ద ఘనంగా అన్నదానం
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సర్వేపల్లి గ్రామంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కల్వకుంట్ల ఉపేందర్ రెడ్డి సౌజన్యంతో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. అంతకుముందు వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ యాస లక్ష్మారెడ్డి, మండల నాయకులు, గణేష్ భక్తులు తదితరులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.