విశాఖ తాగునీటికి శాశ్వత పరిష్కారం: భారీ ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం నగరానికి తాగు, పారిశ్రామిక నీటి అవసరాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా భూదేవి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 6.55 టీఎంసీలకు పెంచి, సుమారు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు. పోలవరం ఎడమ కాలువ నుంచి మేహాద్రిగడ్డ రిజర్వాయర్ కు గోదావరి జలాలను తరలించేలా వ్యవస్థలను మెరుగుపరుస్తున్నట్లు జలవనరులశాఖ స్పష్టం చేసింది.