ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో కలెక్టర్ కీలక సమీక్ష
రిపోర్టర్: సునీల్
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ప్రగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్భంగా క్షుణ్ణంగా చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో, పారదర్శకంగా అందేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పథకాల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.