ఓవర్సీస్‌లో నాని ది ప్యారడైజ్ మూవీ సంచలనం
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే ఉత్తర అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్ ప్రీ-సేల్స్ భారీ స్థాయిలో నమోదవుతుండగా, ముందస్తు టికెట్ విక్రయాల ద్వారానే 1.1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జోడీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.