హైదరాబాద్ లో శబ్ద కాలుష్యం ఆందోళనకరం: స్పష్టం చేసిన కాలుష్య నియంత్రణ మండలి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. నివాస ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, చివరకు నిశ్శబ్ద జోన్లలోనూ నిర్ణీత పరిమితులను మించి శబ్దాలు నమోదవుతున్నాయని వారు పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న ఈ శబ్ద కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.