కేబీఆర్ పార్క్ ప్రాజెక్టుపై డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్

కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు వ్యూహాత్మక లోపాలపై డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (సిర్పూర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వేలాది చెట్లు తొలగించబడి, వందల కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అసమర్థత వల్లే అభివృద్ధి పనుల పేరిట నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ అంశంపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.