జీతాల్లేక అల్లాడుతున్న జెన్కో కార్మికుల దయనీయ బతుకులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.కె.వీధి
సీలేరు ఏపీ జెన్కో ట్రాన్స్ కోలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని డిసిసి కార్యదర్శి కార్య శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. చాలిచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న కార్మికులకు యాజమాన్యం వెంటనే బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు.