కొడగులో విషాదం: చెరువులో కారు పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: కొడగు

కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మడికెరి తాలూకా పరిధిలోని మాల్యారె ప్రాంతంలో కారు అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో విజేశ్, ఆయన భార్య ప్రమితతో పాటు నాలుగేళ్ల పాప లియ బురదలో కూరుకుపోయి ఊపిరాడక దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.