ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో పాటు హెవీ ట్రాన్స్ పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న 18 నుంచి 30 ఏళ్ల వయసు గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. ఈసారి ఎంపిక ప్రక్రియలో భాగంగా శారీరక కొలతలు, పీఈటీ, డ్రైవింగ్ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేశారు.