రామలింగేశ్వర స్వామి ఊరేగింపు సేవతో పరవశించిన యాదాద్రి భక్తజనం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారికి సోమవారం సాయంత్రం ప్రత్యేక ఊరేగింపు సేవ ఘనంగా నిర్వహించారు. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి సేవా పీఠంపై అధిష్టింపజేసి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.