చెత్త నిబంధనలు పాటించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేత అంటూ జీహెచ్ఎంసీ హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

రోజువారీగా వంద కిలోలకు మించి చెత్తను ఉత్పత్తి చేసే సంస్థలు స్వచ్ఛత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేనిపక్షంలో తాత్కాలికంగా విద్యుత్తు, నీటి సరఫరా నిలిపేస్తామని జీహెచ్ఎంసీ అధికారులతో పాటు నగరంలోని మూడు కార్పొరేషన్లు తేల్చిచెప్పాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బల్క్ గార్బేజ్ జనరేటర్ల పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఐటీ సంస్థలు తమ వివరాలను పీసీబీ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.