రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్లో రాజకీయ జోక్యం: ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు స్టే
రిపోర్టర్: మహేష్
స్థలం: జైపూర్
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ తీవ్ర రాజకీయ జోక్యం, వివాదాలతో సంక్షోభంలో చిక్కుకుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్పష్టం చేశాయని క్రీడా వర్గాలు వెల్లడించాయి. హైకోర్టులో వ్యాజ్యాలు పరిష్కారమయ్యే వరకు ఎన్నికల ఫలితాల ప్రకటించరాదని కోర్టు ఆదేశించిందని తెలిపారు. నాయకుల కుమారుల పోటీ, పార్టీ కేంద్ర నాయకత్వ జోక్యంతో రాజస్థాన్ క్రికెట్ భవితవ్యం తీవ్ర ఉత్కంఠకు, అనిశ్చితికి దారితీసిందని పేర్కొంటూ క్రికెట్ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.