ఆంధ్రప్రదేశ్ పింఛన్ల వ్యయం ఏడు పెద్ద రాష్ట్రాలతో సమానమన్న సోమిరెడ్డి
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేవలం పింఛన్ల కోసమే ప్రతినెలా రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఇది దేశంలోని ఏడు పెద్ద రాష్ట్రాల సంక్షేమ వ్యయంతో సమానమని ఆయన పేర్కొన్నారు. ఈ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ భరోసాను చాటుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.