షాకింగ్ ఘటన: హెలికాప్టర్ దిగుతుండగా తడబడి కిందపడబోయిన ఉషా వాన్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: Maryland

అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ హెలికాప్టర్ మెట్లపై నుంచి దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా కాలు తడబడి కిందపడబోయినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె తన ఛాతికి కట్టి ఉన్న బేబీ క్యారియర్లో పసికసువును మోసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఆమె వెంటనే రెయిలింగ్ పట్టుకుని సర్దుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.