విప్లవ యోధుడు రావి నారాయణరెడ్డి పోరాటం అజరామరం
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలో విప్లవ యోధుడు రావి నారాయణరెడ్డి వర్ధంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. పేదలకు భూములు పంచిన ఆయన ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.