రాష్ట్రానికి మరో తుపాను ముప్పు: ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఆరు గంటలకు ఒకసారి పరిస్థితిని అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఆయన ఆర్టీజీఎస్ లో వాతావరణ పరిస్థితులు, పునరుద్ధరణ పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. నవంబరు మూడు, నాలుగు తేదీల్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ, తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో విద్యుత్ సరఫరా మరియు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.